ఇజ్రాయెల్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడునున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు నెతన్యాహు ప్రత్యర్థి అయిన ఐసెన్‌కోట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు ఐసాక్ ఆహ్వానించారు. ఆదివారం ప్రెసిడెంట్ నివాసంలో ఈ కీలక నియామక ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐసెన్‌కోట్‌కు బలనిరూపణ కోసం 28 రోజుల గడువు లభిస్తుంది, అవసరమైతే మరో 14 రోజుల గడువును పొడిగించుకునే అవకాశం ఉంది. అప్పటివరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.