ఎల్ నినోతో టమోటా రైతులకు తీవ్ర నష్టం!

25చూసినవారు
ఎల్ నినోతో టమోటా రైతులకు తీవ్ర నష్టం!
ఎల్ నినో ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా టమోటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసాధారణ ఉష్ణోగ్రతలు, రుతుపవనాల బలహీనత వల్ల వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టమోటా దిగుబడి గణనీయంగా తగ్గింది, నాణ్యత కూడా దెబ్బతింది. అన్నమయ్య జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో దాదాపు 9 వేల హెక్టార్లలో సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది కంటే దిగుబడి సగానికి పైగా తగ్గింది. జిల్లాలో 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

సంబంధిత పోస్ట్