ఎల్‌నినో ఎఫెక్ట్.. రూ.6వేల కోట్ల స్పెషల్ ఫండ్!

16చూసినవారు
ఎల్‌నినో ఎఫెక్ట్.. రూ.6వేల కోట్ల స్పెషల్ ఫండ్!
TG: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తిన తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.6,000 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని నిర్ణయించింది. సుమారు 315 మండలాల్లో నీటి ఎద్దడి, విద్యుత్ కొరతను నివారించడమే ఈ నిధి ప్రధాన ఉద్దేశం. తాగునీరు, వ్యవసాయ విద్యుత్, పశుగ్రాసం సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎల్‌నినో వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం అందించే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సంబంధిత పోస్ట్