ఎల్‌నినో ఎఫెక్ట్.. ఫిబ్రవరిలోనే వేసవి ప్రారంభం!

6చూసినవారు
ఎల్‌నినో ఎఫెక్ట్.. ఫిబ్రవరిలోనే వేసవి ప్రారంభం!
ఎల్​నినో ప్రభావంతో చలికాలం కూడా అధిక ఉష్ణోగ్రతలతో మండువేసవిలా మారనుందని క్లైమేట్‌ ట్రెండ్స్‌ అధ్యయన నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఫిబ్రవరి నెలలోనే వేసవి పరిస్థితులు తలెత్తుతాయని నివేదించింది. 1950 తర్వాత దేశానికి ప్రస్తుత ఎల్​నినో అత్యంత తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొంది. నేలలో తేమ తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం, రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోవడం కారణంగా రాబోయే రబీ పంటలతో పాటు ఆ తర్వాత వచ్చే వేసవి పంటలకు కూడా ముప్పు వాటిల్లుతుందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్