పంజాబ్‌లోని లూధియానాలో బహదూర్కే రోడ్డుపై టియాగో ఈవీ కారు అదుపుతప్పి సైకిల్, మోటార్‌సైకిల్, ఈ-రిక్షాను వరుసగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.