ఫుట్‌బాల్‌తో ఆడుకున్న ఏనుగు.. వైరల్ వీడియో

8చూసినవారు
అస్సాంలోని నుమాలిగఢ్ బఘిదలా టీ ఎస్టేట్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అడవి నుంచి బయటకు వచ్చిన ఒక గజరాజు (ఏనుగు) స్థానిక పిల్లలు ఆడుకునే మైదానానికి చేరుకుంది. అక్కడ మైదానంలో ఉన్న ఒక ఫుట్‌బాల్‌ను చూసి, తన తొండంతో విసురుతూ, కాళ్లతో తన్నుతూ కాసేపు జాలీగా ఆడుకుంది. ఏనుగు ఫుట్‌బాల్ ఆడుతున్న ఈ వింత దృశ్యం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్