ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన TG TET పరీక్ష
ఫలితాలు ఈ నెల 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/ లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షకు 24వేల మందికి పైగా టీచర్లు హాజరయ్యారు. సర్వీస్లో ఉన్న టీచర్లు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై అవ్వాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహించారు.