
లవర్ని కత్తితో పొడిచి చంపి.. విషం తాగిన ప్రియుడు
ఢిల్లీలోని ఓ హోటల్లో ఒక యువతిని ఆమె ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. బీహార్‌కు చెందిన శివాని, రాజస్థాన్‌కు చెందిన ప్రకాష్ లాహోరీ గేట్ ప్రాంతంలోని హోటల్లో బస చేశారు. బుధవారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రకాష్ ఆమెను కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం ఉదయం హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, శివాని అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ప్రకాష్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.




