కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయండి: విక్టరీ వెంకటేష్ (వీడియో)

1చూసినవారు
కాలేజీ జీవితంలోని 3-4 సంవత్సరాలు విద్యార్థులు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని విక్టరీ వెంకటేష్ సూచించారు. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఆదర్శ కుటుంబం మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకునే రోజులు మళ్లీ తిరిగి రావని, అప్పుడప్పుడు క్లాసులు బంక్ కొట్టడం కూడా అవసరమని, అలా చేయడం వల్లే తనకు చాలా మంచి ఐడియాలు వచ్చాయని సరదాగా చెప్పుకొచ్చారు. చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను పెంపొందించుకోవడం జీవితంలో చాలా ముఖ్యమని ఆయన విద్యార్థులకు హితవు పలికారు.

సంబంధిత పోస్ట్