జపాన్లోని కగోషిమా ప్రిఫెక్చర్లో గల సకురాజిమా అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:35 గంటలకు సంభవించిన ఈ ఘటనలో, బూడిద, పొగతో కూడిన దట్టమైన మేఘం ఆకాశంలో సుమారు 1,000 మీటర్ల ఎత్తుకు ఎగిసింది. ఈ భయంకరమైన దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్ వాతావరణ సంస్థ వెంటనే స్పందించి, అగ్నిపర్వత హెచ్చరికను స్థాయి 3కి కొనసాగించింది. పర్వత సమీప ప్రాంతాల్లోకి ప్రవేశాన్ని అధికారులు నిషేధించారు.