జపాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం

1చూసినవారు
జపాన్‌లోని సకురాజిమా అగ్నిపర్వత విస్ఫోటనం చెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఒక సాధారణ రోజున, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చుకుంటూ భారీ బూడిద మేఘం పైకి ఎగిసిపడటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. హాలీవుడ్ సినిమాను తలపించే ఈ దృశ్యం చూస్తున్న వారిని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ స్పందించి, అగ్నిపర్వత హెచ్చరిక స్థాయిని 3గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకూడదని కఠినమైన నిషేధం విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్