అద్దె చెల్లించలేదని ఈఎస్ఐ ఆసుపత్రికి తాళం

8చూసినవారు
అద్దె చెల్లించలేదని ఈఎస్ఐ ఆసుపత్రికి తాళం
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద 15 నెలల అద్దె బకాయిలు పేరుకుపోవడంతో శుక్రవారం భవన యజమాని ఆసుపత్రికి తాళం వేశారు. దీంతో వైద్య సిబ్బంది, చికిత్స కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై కార్మికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అద్దె బకాయిలు విడుదల చేసి, ఆసుపత్రి సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్