నవంబర్ 5న మరోసారి ఎథిక్స్ కమిటి సమావేశం

4చూసినవారు
నవంబర్ 5న మరోసారి ఎథిక్స్ కమిటి సమావేశం
తెలంగాణ శాసనసభకు సంబంధించిన ఎథిక్స్ కమిటి నవంబర్ 5న మరోసారి సమావేశం కానుంది. శుక్రవారం సమావేశం జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన 45 నిమిషాల వీడియోను వచ్చే కమిటి మీటింగ్‌లో ప్రదర్శించాలని నిర్ణయించారు. పాడి కౌశిక్‌రెడ్డి వ్యక్తిగత హాజరుపై వచ్చే సమావేశంలో నిర్ణయించనున్నారు. మరోవైపు విచారణ ఆలస్యం చేసేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్