ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 'బ్రెయిన్ డెడ్' అయ్యారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆ దేశం స్పందించింది. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేస్తూ, తాజాగా అధికారులతో కలిసి ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను విడుదల చేసింది. ఆయన మరణించారనే వార్తలు అవాస్తవమని, ఆయన బ్రతికే ఉన్నారని నార్త్ కొరియా అధికారులు ఈ ఫోటోల ద్వారా నిరూపించారు. దీనితో అధ్యక్షుడి మరణంపై సాగుతున్న పుకార్లకు అధికారికంగా తెరపడింది.