
తిరుమలలో అపచారం.. బూట్లతో అలిపిరి మెట్లు ఎక్కుతున్న భక్తులు (వీడియో)
తిరుమలలో పవిత్ర అలిపిరి మెట్ల మార్గంలో కొందరు భక్తులు షూస్ వేసుకుని నడిచిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు నలుగురు నుంచి ఆరుగురు చెప్పులు ధరించి మెట్లు ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన మెట్ల మార్గంలో షూస్ వేసుకుని నడవడాన్ని ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ విచారణ చేపట్టి, విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




