మిర్చి కాంపౌండ్‌లో పేలుడు.. మహిళ మృతి

5చూసినవారు
మిర్చి కాంపౌండ్‌లో పేలుడు.. మహిళ మృతి
TG: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. నగరంలోని మిర్చి కాంపౌండ్‌లోని కాళీ ప్రదేశంలో భారీగా పేరుకుపోయిన చెత్తలో ఓ మహిళ పనికిరాని వస్తువులు ఏరుకుంటోంది. అయితే చెత్త సేకరించే సమయంలో పేలుడు సంభవించి, అక్కడికక్కడే మహిళ మృతిచెందారు. ఆ పేలుడు దాటికి మహిళ శరీర భాగాలు తునా తునకలై ఎగిరి పడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు ఏం జరిగిందో అని ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్