రైతును వెంబడించి రూ.2 లక్షలు కొట్టేశారు (వీడియో)

0చూసినవారు
AP: బ్యాంకు నుంచి రైతును వెంబడించిన ఓ దుండగుడు అతడి దగ్గర నుంచి రూ.2 లక్షలు దొంగలించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద చోటుచేసుకుంది. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని రైతు లక్ష్మీ స్వీట్స్ షాపు వద్ద బైక్‌ను ఆపాడు. రైతును వెంబడించిన దొంగ బైక్‌లో ఉన్న రూ.2 లక్షలు కాజేసి పారిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్