TG: ప్రభుత్వంపై రైతుల్లో అసంతృప్తి ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం
కాంగ్రెస్ అభయహస్తమని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని, ఎన్నికల ముందు అభయ హస్తం.. తర్వాత రిక్త హస్తం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వంచనకు అభయహస్తం ప్రతిరూపమన్నారు.