అహ్మదాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గర్బా క్లాస్ ముగించుకుని భర్తతో కలిసి వేర్వేరు ద్విచక్ర వాహనాలపై ఇంటికి వెళ్తున్న నవవధువును రాజస్థాన్ రిజిస్ట్రేషన్ బైక్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. ప్రమాదం తర్వాత బైక్ నడుపుతున్న వ్యక్తి బైక్ వదిలి పరారీ అయ్యాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయింది. బోపాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.