యూఏఈలో ఘోర ప్రమాదం.. మృతుల్లో భారతీయులు

17చూసినవారు
యూఏఈలో ఘోర ప్రమాదం.. మృతుల్లో భారతీయులు
యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు, ట్రక్కు బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. అయితే, మరణించిన వారిలో భారతీయుల సంఖ్య, వారి స్వస్థలాల వివరాలు ఇంకా తెలియరాలేదు. కాన్సులేట్ కార్యాలయం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబాలను సంప్రదించామని, సహాయక చర్యల కోసం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్