ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. ఒకరు మృతి

11చూసినవారు
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. ఒకరు మృతి
AP:ఏలూరు జిల్లా చింతలపూడి యండపల్లి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తున్న జగన్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్‌ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 24 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్