మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై తదుపరి విచారణ చేపట్టారు.