హైదరాబాద్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. తొలుత ఒక కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వెనుక వస్తున్న ఐదు కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగనప్పటికీ, ఆరు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.