గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం మగ స్నేహితుడితో కలిసి ఉన్న వీడియో వైరల్ కావడంతో 22 ఏళ్ల యువతిని ఆమె తండ్రి, సోదరుడు కలిసి 'పరువు' పేరుతో హత్య చేశారు. ఫ్యాబ్రికేషన్ వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులు, సర్ఖేజ్లోని ఘెల్జీపురా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ముందు యువతిపై సుత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు.