కొడుకుని చంపిన తండ్రి.. చితకబాదిన గ్రామస్తులు

17చూసినవారు
కర్ణాటకలోని తుమకూరు జిల్లా కునిగల్ పీఎస్ పరిధిలోని చౌడనాయకనపాళ్యలో ఆదివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్య రజితతో గొడవ పడుతున్న నంజేగౌడను, వారి 16 ఏళ్ల కుమారుడు సునీల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన తండ్రి, భార్యను బయటకు నెట్టి గదిలో కొడుకును తీవ్రంగా కొట్టి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జీపులో తీసుకెళ్తుండగా, ఆగ్రహించిన గ్రామస్తులు అతడిని బయటకు లాగి చితకబాదారు. స్పృహ కోల్పోయిన నంజేగౌడను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్