దేశ రాజధాని ఢిల్లీలోని వికాస్ నగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి పని నిమిత్తం మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.ఈ విషయాన్ని బాలిక పొరుగింటి వాళ్లకు చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.