హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లోని ప్రభుత్వ సైనిక శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 53 మంది సైనికులు మృతి చెందారు. శరీర భాగాలు వేరై.. మృతదేహాలు కుప్పలుకుప్పలుగా పడి ఉన్న వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ ఘటనలో తొలుత 20 మంది సైనికులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం సమాచారమిచ్చింది. ఆ తర్వాత మరణాల సంఖ్య 53కు పెరిగిందని ధ్రువీకరించింది.