బెంగళూరు వేదికగా
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదో
టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే వర్షం కారణంగా టాస్ ఆలస్యమవుతోంది. వర్షం తగ్గిన తర్వాత మైదానం సిద్ధం చేసేందుకు ఇంకాస్త సమయం పట్టనుంది. ఐదు టీ20ల సిరీస్లో ఇప్పటికే ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. దీంతో సిరీస్ డిసైడ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.