సినీ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత

73చూసినవారు
సినీ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాలను నిర్మించిన సినీ నిర్మాత జార్జ్ పియస్ (63) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కమల్ హాసన్ నటించిన 'పాపనాశం', అజిత్ నటించిన 'బిల్లా-2' చిత్రాలతో పాటు 'మిత్-మై ఫ్రెండ్', 'ది బాడీ' వంటి పలు చిత్రాలను ఆయన నిర్మించారు. 'దృశ్యం', '13B', '180' వంటి చిత్రాలకు లైన్/ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారు. జార్జ్ పియస్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్