హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో ఉన్న ఒక పెట్రోల్ బంక్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ పోస్తుండగా, బైక్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు అంటుకోవడంతో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.