27 మంది భారతీయులు ఉన్న నౌకలో అగ్ని ప్రమాదం

34చూసినవారు
27 మంది భారతీయులు ఉన్న నౌకలో అగ్ని ప్రమాదం
ఒమన్ తీరంలో దుబాయ్‌కు చెందిన నౌక ఇంజిన్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పుడు ఆ నౌకలో 27 మంది భారతీయులు ఉన్నారు. మంటలను అదుపులోకి తేవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ అగ్నిప్రమాదానికి లింపెట్ మైన్స్ కారణమని సమాచారం. ఒక చిన్న పడవలో వచ్చిన కొందరు చమురు ట్యాంకర్ ఇంజిన్ రూమ్ దిగువభాగంలో రెండు మైన్స్‌ను అమర్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంజిన్ రూమ్‌లో పేలుడు సంభవించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్