AP: విజయవాడ రైల్వే స్టేషన్లో బుధవారం వందేభారత్ రైలులో మంటలు వ్యాపించాయి. సీ4 బోగీలో పొగలు, మంటలు వ్యాపించాయి. గమనించిన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.