దీపావళి రాకెట్ కారణంగా.. అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం (VIDEO)

6చూసినవారు
ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతంలో ఉన్న పంత్‌నగర్‌లో దీపావళి రాకెట్ వల్ల ఒక అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళికి ముందే టపాసులు కాలుస్తుండగా.. ఒక రాకెట్ దూసుకుపోయి ఉషాకిరణ్ సిహెచ్ఎస్ (CHS) భవనంలోని 23వ అంతస్తులో పడింది. దీనివల్ల ఆ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్