హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జోన్ డీసీపీ చిత్తలూరి శ్రీధర్‌గౌడ్ దీపావళి వేడుకలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వ్యాపారులు అగ్నిమాపక, పోలీసు శాఖల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, దుకాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. 18 ఏళ్ల లోపు వారికి టపాసులు విక్రయించవద్దని, అత్యవసర నెంబర్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.