వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా తొలి పాట ‘దివ్వికి దివ్వికి’ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.