AP: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట మత్స్యకారుల బోటు గల్లంతైంది. ఈ నెల 11న సుబ్బంపేట నుంచి ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ నెల 14 వరకు ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు అందుబాటులో ఉన్నారు. కానీ, ఆ తర్వాత 10 రోజులుగా సమాచారం రాలేదు. దాంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళనలో ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.