కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి (వీడియో)

8చూసినవారు
కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతు అయ్యారని అధికారులు వెల్లడించారు. అటు మలప్పురం జిల్లాలోని నిలంబూర్-అమరంబలం ప్రాంతంలో నదిలో పొటెత్తిన వరదల్లో ఐదుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వాందూర్‌కి చెందిన ఓ బృందం నదిలో దిగి స్నానం చేస్తుండగా.. వరదలో కొట్టుకుపోయినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్