దేశంలో ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను 15 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. 12 నుంచి 60 నెలల కాలపరిమితి గల అన్ని ఎఫ్డీలపై ఈ పెంపు వర్తిస్తుంది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త డిపాజిట్లు, రిన్యూవల్స్ రెండింటికీ ఈ పెంపు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. 31 నుంచి 60 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై క్యుములేటివ్ విధానంలో సంవత్సరానికి 7.75 శాతం వరకు వడ్డీ లభిస్తుంది, ఇది ఇంతకుముందు 7.40 శాతంగా ఉండేది. 12 నుంచి 17 నెలల కాలానికి 6.80%, 18 నుంచి 30 నెలల కాలానికి 7.00% వడ్డీ రేట్లు సవరించబడ్డాయి.