రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాల వల్ల అజ్మేర్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఖ్వాజా గరీబ్ నవాజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనిని గమనించిన స్థానికులు, టీస్టాల్ నిర్వాహకులు అతడిని సురక్షితంగా బయటికి తీసి ప్రాణాలు కాపాడారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్గా మారాయి. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.