మస్కట్ నుండి శంషాబాద్ రావాల్సిన ఇండిగో
విమానం సాంకేతిక కారణాల వల్ల దారి మళ్లించబడింది. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను గుర్తించిన సిబ్బంది, అత్యవసర జాగ్రత్తగా విమానాన్ని బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు
విమానం బెంగళూరు ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.