హూతీలతో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసుల రద్దును విమానయాన సంస్థలు పొడిగించాయి. ఎయిర్
ఇండియా, ఎయిర్
ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు రియాద్, దమామ్‌కు వెళ్లే విమానాలను ఈ నెల 30 వరకు, జెడ్డాకు వెళ్లే సర్వీసులను ఈ నెల 21 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థలు కూడా సౌదీకి వెళ్లే విమానాలను ఈ నెల 30 వరకు రద్దు చేసినట్లు ఇప్పటికే వెల్లడించాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.