జపాన్లోని నగోయాలో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా క్రీడలకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. నగరంలో గంటలోనే 104.5 మి.మీ వర్షపాతం నమోదై పలు ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. దీంతో షిప్పింగ్ కంటైనర్లలో బస చేస్తున్న సుమారు 400 మంది క్రీడాకారులు, సిబ్బందిని తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేదికల పైకప్పులు కొన్ని చోట్ల లీకవుతున్నా, క్రీడల నిర్వహణకు పెద్దగా ఇబ్బంది లేదని నగోయా మేయర్ తెలిపారు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 11 వేల మందికిపైగా అథ్లెట్లు పాల్గొననున్నారు.