
పెళ్లి పార్టీలో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో రాజధాని కిన్షాషాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక బిల్డింగ్లో నిర్వహించిన పెళ్లి పార్టీలో ఈ ప్రమాదం జరిగి దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని లింగ్వాలా మేయర్ నార్బర్ట్ ముషింగ తెలిపారు.




