
సీఈసీకి అండగా విశ్రాంత ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు విశ్రాంత ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు అండగా నిలిచారు. ఈ మేరకు 124 మంది విశ్రాంత IAS, IFS అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల అక్రమాలపై ఆధారాలతో కూడిన ఆరోపణలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇప్పుడు ఎన్నికలపై 'రిగ్గింగ్' పదాన్ని వాడుతున్నారని ప్రశ్నించారు. ఆ పదాన్ని పదే పదే వాడటం వల్ల ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతోందని, అందుకే తాము లేఖ రాశామన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు.




