నేపాల్ రుసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో వరదల కారణంగా మూడ్రోజులుగా మట్టి, శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆరేళ్ల బాలికను సహాయక సిబ్బంది గుర్తించి ప్రాణాలతో రక్షించారు. సాయుధ పోలీసు బలగాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా చిన్నారి ఏడుపు వినిపించడంతో, శిథిలాలను తొలగించి ఆమెను బయటకు తీశారు. అనంతరం బాలికను చికిత్స నిమిత్తం కాఠ్మాండు ఆస్పత్రికి తరలించారు.