TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జోగినపల్లి శ్రీనివాస్ రావు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధువు. శ్రీనివాస్ రావు మరణవార్త తెలిసిన వెంటనే ఎర్రబెల్లి హుటాహుటిన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ శ్రీనివాస్ రావు పార్థివదేహానికి అశ్రునయనాలతో నివాళులర్పించారు.