TG: రాష్ట్రంలో
కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పట్టుకోల్పోకుండా ఉండటానికి తెలంగాణపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర
కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మాజీ సీఎంకు బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పేరును పార్టీ అధిష్ఠానం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అపార రాజకీయ అనుభవం ఉన్న గెహ్లాట్ వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.