కర్ణాటకలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా కార్కల సమీపంలో మాజీ మంత్రి రామనాథ రాయ్ ప్రయాణిస్తున్నకారును ఓ ప్రైవేట్ బస్సు ఎదురుగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారు వెనుక సీట్లో కూర్చున్న మాజీ మంత్రికి స్వల్పంగా గాయాలయ్యాయి. దాంతో ఆయనకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.