AP: మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చిమహేశ్వరరావు (బుచ్చిబాబు)(75) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. బుచ్చిబాబు స్వస్థలం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామం. 1983, 1994లో అల్లవరం నియోజకవర్గం నుంచి
టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో అమలాపురం ఎంపీగా గెలిచారు. గతంలో కాంగ్రెస్లో చేరినా ఆయన తిరిగి టీడీపీలోకి వచ్చారు.