టిప్పర్ - కారు ఢీకొని నలుగురి మృతి

3చూసినవారు
టిప్పర్ - కారు ఢీకొని నలుగురి మృతి
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఘోర రహదారి ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారును బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కారు డ్రైవర్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్